Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లాల్సిందే. ప్రపంచంలోని అందమైన లొకేషన్లలో భార్యాపిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం మహేష్‌కు అలవాటు. అయితే, ఈసారి ఆయన దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పడటంతో, ఆ సమ్మర్ ట్రిప్ సాధ్యమేనా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ, ఎట్టకేలకు మహేష్ కోరుకున్నట్లే జరిగింది. రెండేళ్లుగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌లో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. జక్కన్న సెట్స్‌పై ఉంటే టైం అస్సలు దొరకదని అందరికీ తెలిసిందే. అందుకే ఈ వేసవిలో కూడా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతుందని, సమ్మర్ ట్రిప్‌కు ఛాన్స్ ఉండదని అందరూ భావించారు. కానీ, ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, మహేష్‌కు జక్కన్న చిన్న బ్రేక్ ఇచ్చారు.
Also Read :Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ప్రస్తుతం మహేష్ బాబుపై ఒక భారీ సాంగ్ షూట్ జరుగుతోంది. దీనికి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ స్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ చెక్కేయనున్నారు. తన పిల్లల సమ్మర్ వెకేషన్ కోసం ఆయన ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమ్మర్ బ్రేక్ తర్వాత, తిరిగి జూన్ నెలలో ‘వారణాసి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అప్పటి వరకు మహేష్ బాబు విదేశాల్లో సేదతీరి, మళ్ళీ ఫుల్ ఎనర్జీతో సెట్స్ పైకి రానున్నారు. రెండేళ్లుగా విరామం లేకుండా పనిచేస్తున్న సూపర్ స్టార్‌కు ఈ హాలిడేస్ ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎపిక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
- Tags
- mahesh babu
- rajamouli
- Varanasi
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!