Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
- ‘క్యూట్’ మెసేజ్ వివాదం
- చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
- ఇన్‌స్టాగ్రామ్‌లో “ఆప్ క్యూట్ హో” (మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు) అని మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున IPL 2026లో ఆడుతున్నారు. బాలీవుడ్/ఓటీటీ నటి-ఇన్‌ఫ్లుయెన్సర్ తానియా ఛటర్జీ మధ్య ‘క్యూట్’ ఇన్‌స్టాగ్రామ్ DM వివాదం ఇప్పుడు న్యాయస్థాన స్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం ఒక పాపరాజీ వీడియోలో తానియా ఛటర్జీ తన ఫోన్‌ను కెమెరాకు చూపిస్తూ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో “ఆప్ క్యూట్ హో” (మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు) అని మెసేజ్ పంపినట్లు వెల్లడించింది. ఆమె చాహల్ తన పాత వీడియోలు కూడా షేర్ చేశారని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద దుమారం రేపింది.
Also Read:Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
Also Read
నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు:ఒక వర్గం చాహల్‌ను వ్యక్తిగత జీవితం గురించి విమర్శించగా, మరొక వర్గం తానియాను “ఉచిత పబ్లిసిటీ” కోసం ఇలా చేస్తోందని ట్రోల్ చేశారు. ఈ వైరల్ వీడియో, ఆరోపణల వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించిన చాహల్, తానియా ఛటర్జీపై పరువు నష్టం కేసు/నోటీసు దాఖలు చేశారు. చాహల్ తనకు డిఫమేషన్ నోటీసు ఇమెయిల్ ద్వారా పంపినట్లు ఆమె బహిర్గతం చేసింది. “నేను ఎవరి ఇమేజ్‌ను దెబ్బతీయలేదు. నేను చాహల్‌ను గౌరవిస్తాను. నేను ఏమీ తప్పు చేయలేదు” అని చెప్పింది. తాను ట్రోలింగ్‌కు గురవుతున్నానని, చాహల్‌ను మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. లాయర్‌ను నియమించుకున్నట్లు తెలిపింది.
వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. చాహల్ వైపు నుంచి ఇంకా అధికారిక స్టేట్‌మెంట్ రాలేదు. తానియా మాత్రం “మైన్ హీ బద్‌నామ్ హో రహీ హూం” అంటూ తనను తాను బాధితురాలిగా చిత్రీకరించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రైవేట్ మెసేజ్‌లు బహిర్గతం చేయడం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, పబ్లిసిటీ స్టంట్‌లు వంటి అంశాలపై తీవ్ర చర్చనీయాంశం అయింది.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!