Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయితే, అది ఓటీటీలోకి వచ్చినప్పుడు నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటారు. సినిమాలోని లోపాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో ట్రోలింగ్ చేస్తూ హల్చల్ చేస్తారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో మాత్రం సీన్ టోటల్‌గా రివర్స్ అయింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా కనీస ప్రభావం చూపలేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు 130 కోట్లకు అమ్ముడుపోగా, క్లోజింగ్ కలెక్షన్లు మాత్రం కేవలం 60 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. అంటే సగానికి పైగా నష్టాలను మిగిల్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది.
Also Read :Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్ ఇచ్చేశాడా?
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
సాధారణంగా భారీ సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చినప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంటాయి. కానీ ‘ఉస్తాద్’ విషయంలో ఆ సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిణామాలు పరిశీలిస్తే థియేటర్లలో టాక్ బాలేదని తెలిసిన తర్వాత, ఓటీటీలో కూడా తమ సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకని ప్రేక్షకులు భావిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఏదైనా సినిమాలో కంటెంట్ ఉంటే మెచ్చుకుంటారు, మరీ దారుణంగా ఉంటే ట్రోల్ చేస్తారు. కానీ ఉస్తాద్‌ను కనీసం ట్రోల్ చేయడానికి కూడా నెటిజన్లు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అసలు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి చాలా మందికి తెలియదు అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పెద్ద హీరోల సినిమాలకు ఓటీటీ రేట్లు భారీగా ఉండటానికి కారణం.. అవి అక్కడ కూడా వ్యూవర్‌షిప్ సాధిస్తాయనే నమ్మకం. అయితే ‘ఉస్తాద్’ లాంటి ఫలితాలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో డిజాస్టర్ సినిమాల ఓటీటీ రైట్స్ మరింత పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్, పాత కాలపు కమర్షియల్ ఫార్ములాలు ప్రస్తుత ఆడియన్స్‌కు రుచించడం లేదు. కేవలం హీరో ఇమేజ్ మీదనే సినిమాను నెట్టుకురావాలని చూడటం ఓటీటీ ఆడియన్స్‌కు నచ్చడం లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి థియేటర్లలో 70 కోట్ల నష్టాన్ని మిగిల్చిన ‘భగత్ సింగ్’, ఓటీటీలో కూడా కనీసం ప్రేక్షకులను ఆకట్టుకోలేక ‘డబుల్ డిజాస్టర్’గా నిలిచింది.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!