గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగిన విధానంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటోన్నారు చంద్రబాబు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాత్రి పూట వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే అలవాటును కొందరు టీడీపీ నేతలు మానుకోవాలి. నేను చచ్చినా.. నువ్వు చచ్చినా పార్టీ జండా కప్పుతారు ప్రాణాల కోసం వైసీపీ వాళ్ళతో రాత్రిళ్లు మాట్లాడుతారా..!? ఆ అవసరం లేదు అని తెలిపారు. 2014- 2019 వరకు గురజాలలో వైసీపీ నేతలపై ఒక్క దాడి జరగలేదు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. టీడీపీ హయాంలో ఎక్కడా ఈ తరహా రాజకీయ దాడులు చెయ్యలేదు. పోలీసులే దగ్గరుండి హత్యకు సహకరిస్తున్నారు. అక్రమ మైనింగ్ పై ప్రశ్నించారని ఐదు మందిని కత్తులతో నరికారు. 80 ఏళ్ల వృద్ధుల పైనా హత్యా నేరం కేసులు కట్టారు. పల్నాడులో ప్రాణాలకు ఎవరూ లెక్క చెయ్యరు పల్నాడులోగాని.. రాష్ట్రంలో గాని ఇక వైసీపీ ఆటలు సాగవు అని తెలిపారు.
అయితే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే తగ్గినట్లు కాదు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. వైసీపీ నేతలు100 తప్పులు చేసేశారు. రాష్ట్రం వైసీపీ జాగిరా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడ ఉంటారు.. ఇప్పుడు టీడీపీ సానుభూతి పరుల పెన్షన్లు తీసేస్తున్నారు.. నాలుగు రోజుల తరువాత నిధుల్లేక వైసీపీ సానుభూతి పరుల పెన్షన్లు తీసేస్తారు అని పేర్కొన్నారు.