గులాబీ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో నిన్నటి నుండి వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ కు అతి భారీ వర్షం ముప్పు తప్పిందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది. జీహెచ్ఎంసి పరిధిలో అక్కడక్కడా తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. అయితే ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల తీవ్రత తగ్గింది. ఈ రాత్రికి ఒక మోస్తరు వర్షం… దఫా దఫాలుగా కురిసే […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్ఆర్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(6)తో నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(36) తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక జైస్వాల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్(4) కూడా వెంటనే పెవిలియన్ కు చేరుకోగా శాంసన్ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లను […]
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి అని వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కమిషనర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పరు చేసారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లు ఆదేశించారు. నగరంలోని […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రైజర్స్ వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడటం లేదు. […]
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… రెండు వేల రెండు వందలకు పైగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్ తో పని చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అని తెలిపారు. ప్రభుత్వం పలు పథకాలు అందిస్తున్నా…ఎయిడెడ్ స్కూళ్ళల్లో విద్యార్ధుల ఎన్ రోల్ మెంట్ పెరగలేదని గమనించాం. రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో ఏప్రియల్ లో కమిటిని ఏర్పాటు చేశాం. ఈ కమిటి నివేదిక కూడా ఇచ్చింది. […]
మహిళలు, ఆడ బిడ్డల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిపోతుంది. ఇక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆర్ ఆ, కేటీఆర్ ఆ లేక హోం మినిస్టర్ ఆ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఐటీ పైన అసెంబ్లీ లో చెత్త పేపర్ ఇచ్చారు…. అందులో అంత అబద్ధమే. రామ గుండం పర్టిలైజర్ ఫ్యాక్టరీ ని కేంద్రమే స్థాపించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు కేంద్రం నిధులు ఇచ్చిన ఏర్పాటు చేయడం […]
ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిగిలిన సీజన్ ను బీసీసీఐ యూఏఈ నిర్వహిస్తుంది. దాంతో అన్ని అక్కడికి చేరుకున్నాయి. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు స్పిన్నర్ లలో ఒక్కడైన కుల్దీప్ యాదవ్ తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. యూఏఈ లో ఫిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తుంది. దాంతో తిరిగి ఇండియా కు వచ్చి […]
దేవాదాయ శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్ధతులు తీసుకురావాలి. టీటీడీలో అమలు చేస్తున్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లో ప్రవేశపెట్టాలి. ఆన్లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలి. దేవాదాయ శాఖలో అవినీతికి చోటు లేకుండా చూడండి. ఆన్లైన్ పద్ధతులను అమలు చేయడంద్వారా అవినీతి లేకుండా చూడొచ్చు. ఆన్లైన్ పద్ధతులు, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద […]
యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు సమయం దగ్గరకు వస్తుంది. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక భారత జట్టుకు ప్రకటిస్తున్న సమయంలో బీసీసీఐ ధోనిని ఆ జట్టుకు మెంటార్ గా నియమించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఇక తాజాగా దీని పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్పందించాడు. ధోనిని మెంటార్ గా నియమించడం మంచి నిర్ణయమేనని […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ వెయ్యికి పైగా నమోదు అవుతూ వస్తుండగా ఈరోజు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,069 శాంపిల్స్ పరీక్షించగా.. 618 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,178 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,81,32,713 […]