యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు సమయం దగ్గరకు వస్తుంది. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక భారత జట్టుకు ప్రకటిస్తున్న సమయంలో బీసీసీఐ ధోనిని ఆ జట్టుకు మెంటార్ గా నియమించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఇక తాజాగా దీని పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్పందించాడు. ధోనిని మెంటార్ గా నియమించడం మంచి నిర్ణయమేనని దానిని సమర్ధించాడు. ధోని వంటి ఆటగాడు టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటె చాలా మేలు జరుగుతుందని చెప్పాడు. ధోని టీ20 క్రికెట్ లో ఒక ఉత్తమమైన కెప్టెన్. అతని నిర్ణయాలు దాదాపుగా ఎప్పుడు సరైనవిగానే ఉంటాయి. అతను ఆటను అప్పటి పరిస్థితులను చాలా చక్కగా అంచనా వేస్తాడు. కాబట్టి ధోని బుర్ర టీం ఇండియాకు చాలా అవసరం అని పేర్కొన్నారు. అయితే వచ్చే నెల 17 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా భారత్ 24న పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడనుంది.