ఈరోజు ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్ఆర్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(6)తో నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(36) తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక జైస్వాల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్(4) కూడా వెంటనే పెవిలియన్ కు చేరుకోగా శాంసన్ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం చేసిన సంజు చివరి ఓవర్లో 82 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దాంతో రాయల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే సన్ రైజర్స్ 165 పరుగులు చేయాలి. కానీ ఈ సీజన్ లో హైదరాబాద్ చిన్న లక్ష్యాలనే చేధించలేకపోతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది.