ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిగిలిన సీజన్ ను బీసీసీఐ యూఏఈ నిర్వహిస్తుంది. దాంతో అన్ని అక్కడికి చేరుకున్నాయి. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు స్పిన్నర్ లలో ఒక్కడైన కుల్దీప్ యాదవ్ తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. యూఏఈ లో ఫిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తుంది. దాంతో తిరిగి ఇండియా కు వచ్చి నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాలని అతను నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా కుల్దీప్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. అయితే కేకేఆర్ తుది జట్టులో కుల్దీప్ కు పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు అనే విషయం తెలిసిందే. జట్టులో స్పిన్నర్లు గా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రాణిస్తుండటంతో అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు.ఇక ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన కోల్‌కతా నాలుగింటిలో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.