మహిళలు, ఆడ బిడ్డల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిపోతుంది. ఇక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆర్ ఆ, కేటీఆర్ ఆ లేక హోం మినిస్టర్ ఆ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఐటీ పైన అసెంబ్లీ లో చెత్త పేపర్ ఇచ్చారు…. అందులో అంత అబద్ధమే. రామ గుండం పర్టిలైజర్ ఫ్యాక్టరీ ని కేంద్రమే స్థాపించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు కేంద్రం నిధులు ఇచ్చిన ఏర్పాటు చేయడం లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఓపెన్ చేయమని కేసీఆర్ అంటే ఓపెన్ చేస్తామని కేటీఆర్ అంటున్నారు… ఎవరు కరెక్ట్. ఆత్మ నిర్బర్ భారత్ కింద నిధులు వచ్చాయి. తెరాస ఎమ్మెల్యే లు ఏ అంశం పై మాట్లాడిన కేంద్రం ని టార్గెట్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకో టీం డప్పులు కొట్టేందుకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిధుల పై చర్చ పెట్టేందుకు మేము రడీ అని చెప్పాము… బీజేపీ పెద్దలతో మాట్లాడక ప్లేస్,టైమ్ డిసైడ్ చేస్తాం అని పేర్కొన్నారు.