ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రైజర్స్ వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడటం లేదు. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అవకాశాలు కోల్పోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని అనుకుంటుంటే…. 8 పాయింట్లతో ఆరవ స్థానంలో ఆర్ఆర్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు అవకాశాలు మెరుగు పరుచుకోవాలని అనుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
హైదరాబాద్ : జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (WK), కేన్ విలియమ్సన్ (C), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ
రాజస్థాన్ : ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (WK/C), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్