విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ… రెండు వేల రెండు వందలకు పైగా ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ గ్రాంట్ తో పని చేస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు అని తెలిపారు. ప్రభుత్వం పలు పథకాలు అందిస్తున్నా…ఎయిడెడ్ స్కూళ్ళల్లో విద్యార్ధుల ఎన్ రోల్ మెంట్ పెరగలేదని గమనించాం. రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో ఏప్రియల్ లో కమిటిని ఏర్పాటు చేశాం. ఈ కమిటి నివేదిక కూడా ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ ను వదులుకుని ప్రైవేట్ విద్యా సంస్థలుగా నడపటం, లేదా వారి ఆస్థి పాస్థులు ఉంటే ప్రభుత్వానికి ఇచ్చి పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చటానికి ఆప్షన్ ఇచ్చాం. లేదంటే సమర్ధవంతంగా నడుపుతామనే ఆప్షన్ ఇస్తే పర్యవేక్షణ చేస్తాం. జీవో 51, 42, 50 ఇచ్చాం. డిగ్రీ కాలేజీల్లో 93 శాతం యాజమాన్యాలు, జూనియర్ కాలేజీల్లో 89 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ను వదులుకోవటానికి ముందుకు వచ్చారు. స్కూళ్ళల్లో రెండు వేలకు పైగా స్కూళ్ళల్లో 1200 పాఠశాలలు ఎయిడ్ వదులుకోవటానికి అంగీకరించారు. 5 నుంచి 6 వేల మంది ఉపాధ్యాయులు వీటిలో పని చేస్తున్నారు.. ఈ క్రమంలో ఒక్క విద్యా సంస్థ కూడా మూతపడదు అని తెలిపారు.