తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టున పడేసే నాయకుడి ద్వీపదేశం శ్రీలంక ఎదురుచూస్తోంది. ఇవాళ శ్రీలంకలో కొత్త నాయకత్వం కొలువుదీరబోతోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. గత వారం అధ్యక్షభవనంపై నిరసనకారులు దాడి చేయడంతో విదేశాలకు పారిపోయిన గొటబాయ రాజపక్సే స్థానంలో అధ్యక్షుడిని నియమించాలని శ్రీలంక పార్లమెంట్ నిర్ణయించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగానే, ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. రాజ్యసభలోనూ అబే మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పంజాబ్‌లో 99 శాతం ఓట్లు యశ్వంత్ సిన్హాకు వస్తున్నాయని పంజాబ్ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సోమవారం అన్నారు. ఓట్ల రద్దుకు దారితీసే ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశంలో చెప్పామన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రమాదవశాత్తూ గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లో ఈ దుర్ఘటన చేసుకుందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే, ప్రతిపక్షాల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా, దేశ తదుపరి రాష్ట్రపతిగా రేసులో తనకు ఓటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. భారత రాష్ట్రపతి ఎన్నిక చాలా ముఖ్యమైనదని యశ్వంత్ సిన్హా అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?.
దేశంలో భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది.