Drishyam 3 : ఆఖరి ఆట మొదలైంది.. ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ అంతా చూసే ఉంటారు.తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే పోరాటం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది 2026, ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్యారా అనౌన్స్ చేశారు.
Also Read : Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!
Also Read
అయితే రెండవ భాగం ముగింపులో జార్జికుట్టి పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి, ఏకంగా పోలీస్ స్టేషన్ కిందనే శవాన్ని పాతిపెట్టి తెలివిగా తప్పించుకుంటాడు. మరి ఈ మూడో భాగంలో పోలీసులు ఆ శవాన్ని వెలికితీస్తారా? జార్జికుట్టి వేసే ఆఖరి మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. విశేషమేమిటంటే, ఈ సినిమా క్లైమాక్స్ అన్ని భాషల్లోనూ (మలయాళం, హిందీ, తెలుగు) ప్రేక్షకులను అందుబాటులో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే హిందీలో అజయ్ దేవగన్ షూటింగ్ మొదలుపెట్టగా, తెలుగులో మన వెంకటేష్ కూడా త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 2న జార్జికుట్టి కథకు ఒక అదిరిపోయే ముగింపు లభించడం ఖాయం!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!