Madhyapradesh Bus Accident: ఘోరప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు, 13 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖాల్‌ఘాట్ దగ్గర సంజయ్ సేతుపై నుంచి మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సు నర్మదా నదిలో పడిపోయిన ఘటనలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 నుంచి 55 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
Telangana Rains: తెలంగాణను వీడని వానలు. నేడు భారీ వర్షాలు
Also Read
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 13 మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు 15మందిని ప్రమాదం నుంచి రక్షించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 15 మందిని కాపాడినట్లు, మిగతావారి కోసం గాలింపు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికి తీశారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడానన్నారు. తాము సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపట్టామని, ప్రమాదానికి సంబంధించి విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించాలని మంత్రి కమల్ పటేల్‌ను కూడా ఆదేశించామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
ధార్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదం ధార్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం మహారాష్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను జిల్లా కలెక్టర్, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు జరుగుతున్నాయని.. స్థానిక అధికారులు ఈ ఘటనలో బాధితులకు అన్ని రకాల సాయాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Maharashtra CM Eknath Shinde has instructed MSRTC (Maharashtra State Road Transport Corporation) to provide ex gratia of 10 lakhs each to the kin of the deceased in the MSRTC bus accident in Narmada river: Maharashtra Chief Minister's Office (CMO)
(File photo) pic.twitter.com/WafZXbdYdz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..