దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 16,935 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. మణిపూర్ గవర్నర్ లా. గణేశన్‌కు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. సెర్బియా నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని మోసుకెళ్తున్న ఆంటోనోవ్-12 కార్గో విమానం ఉత్తర గ్రీస్‌లోని రెండు గ్రామాల మధ్య కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఉక్రెయిన్ దేశానికి చెందిన 8 మంది విమానయాన సిబ్బంది మృత్యువాతపడ్డారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగష్టు 12 వరకు ఈ సెషన్ కొనసాగనుంది. అ
భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పార్లమెంట్. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ జరగనుంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది.
ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. తాజాగా సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం మధ్యప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ సాధించినట్లైంది.
విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటించాయి.
ఓ రెస్టారెంట్ తప్పుడు ఆర్డర్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వెజ్ కర్రీ ఆర్డర్ చేస్తే పొరపాటున చికెన్ కర్రీ పంపిన రెస్టారెంట్ భారీ మూల్యం చెల్లించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది.