వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలోని సురభి పార్క్ సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి ఆదివారం ప్రాంతంలో కొన్ని గంటల వర్షం తర్వాత కుంగిపోయింది. రోడ్డు కూలిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామివేషన్ వేయనున్నారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) ఐసీఎస్ఈ 10 తరగతి ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి 10వ, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.cisce.org ద్వారా చూసుకోవచ్చు.
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును విపక్ష పార్టీలు ఎంపిక చేశాయి. ఆమెను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. భారత దేశానికి కాబోయే 15వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. సోమవారం రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటులోనూ, రాష్ట్రాల్లోనూ, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పోలింగ్ జరగనుంది.
త్వరలో సింగపూర్‌లో జరగబోయే 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడం పొరపాటని తెలుపుతూ దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాంటి ఉన్నత వేదికలపై ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ ప్రాంతంలో శనివారం జరిగిన ముడి బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సోఫికుల్ ఇస్లాం (32), ఫజ్రుల్ సేఖ్ (37)గా గుర్తించారు.
వేట్ స్కూల్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థిలో మృతి చెందిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. కడలూరు జిల్లా వేప్పూర్‌కి చెందిన బాలిక (16) కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం వద్ద కణియమూరులో ఉన్న ప్రైవేటు పాఠశాల వసతిగృహంలో ఉంటూ 12వ తరగతి చదువుతోంది.