పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన మాన్‌ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ముఖ్యమంత్రికి కడుపునొప్పి రావడంతో ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
ర్ణాటకలో ఓ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను బలంగా ఢీ కొట్టింది.
కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021, మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే నేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
పశ్చిమబెంగాల్‌లో కల్తీసారా ఏడుగురిని కబళించింది. హౌరాలో కల్తీసారా సేవించి 7 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. హౌరాలో ఓ బస్తీలో ఈ ఘటన జరిగింది.
అమెరికాలోని అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌లలో ఒకటైన హూవర్ డ్యామ్ వద్ద మంగళవారం ఒక ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ పేలుడులో మంటలతో కూడిన నల్లటి పొగ భారీ ఎత్తున ఎగిసిపిడింది.
మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది.
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. మొత్తం 219 ఓట్లకు గాను 134 ఓట్లను సాధించి ఆయన విజయం సాధించారు. బుధవారం జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో 134 ఓట్లతో ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చేసిన నినాదాలు, గందరగోళం మధ్య ఉభయసభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. తక్షణమే చర్చకు ప్రతిపక్షాలు లేవనెత్తడంతో ఎగువ సభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా వాయిదా పడింది.