Parliament monsoon session: పార్లమెంట్ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవని ప్రధాని స్పష్టం చేశారు. సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిదని ఆయన వివరించారు.
Read Also:
Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయమని, కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని అందించబోతోందని అన్నారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్నారు. పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని మోదీ అన్నారు. సభ్యులందరూ ఉభయసభల్లో లోతైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోదీ.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కాలం చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలమని, రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలన్నారు.
Read Also:
Presidential Poll 2022: ద్రౌపది ముర్ము X యశ్వంత్ సిన్హా.. గెలుపెవరిది?