రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.
హర్యానాలో డీఎస్పీ హత్య జరిగిన కొద్ది సమయంలోనే అదే తరహాలో జార్ఖండ్‌లో మహిళా ఎస్సై దారుణంగా హత్యకు గురైంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్‌లో గళం వినిపించింది లేదని... ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదని ఆమె మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం ఉదయం వరకు 15,528 కేసులు మాత్రమే నమోదు కాగా ఇవాళ భారీగా పెరిగాయి.
భారత త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను కేంద్రం ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలి ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నేవీలో 13,537, ఎయిర్‌ఫోర్స్‌లో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించే బిల్లును యూఎస్ హౌస్ ఆమోదించింది. స్వలింగ వివాహాల గుర్తింపును సుప్రీం కోర్టు వెనక్కి తీసుకోగలదనే భయాల మధ్య వివాహ సమానత్వాన్ని పరిరక్షించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ మంగళవారం ఆమోదించింది. రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్ పేరుతో ఈ చట్టం 267-157 ఓట్లతో ఆమోదించబడింది,
నటుడు అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బ్లాగ్‌లో చాలా ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆయన తన జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను, జీవిత పాఠాలను వివరిస్తూ ఉంటారు. ఆయన రచనల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇటీవల ఓ ఐదేళ్ల పిల్లవాడితో జరిగిన సరదా సన్నివేశాన్ని తన బ్లాగ్‌లో పంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ గన్స్ కలకలం రేపాయి. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 10 ఫారిన్ మేడ్ ఎయిర్ గన్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి లగేజ్ బ్యాగ్‌లో విదేశీ ఎయిర్ గన్స్ దాచి ఓ ప్రయాణీకుడు తరలించే యత్నం చేశాడు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్‌లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్‌గేట్స్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.