grenade blast: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రమాదవశాత్తూ గ్రెనేడ్ పేలడంతో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్థరాత్రి పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లో ఈ దుర్ఘటన చేసుకుందన్నారు. రాత్రి నియంత్రణ రేఖ వెంబడి సైనికులు తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రమాదవశాత్రు గ్రెనేడ్ పేలిందని.. ఈ పేలుడు కారణంగా ఇద్దరు సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయని ఢిఫెన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గాయాలపాలైన వారిని హెలికాప్టర్ ద్వారా ఉదంపూర్ ఆస్పత్రికి తరలించామన్నారు. వారు చికిత్స పొందుతూ ఆర్మీ కెప్టెన్‌తో పాటు నాయబ్ సుబేదార్(జేసీవో) మరణించారని వెల్లడించారు.
North Korea Rules : నార్త్ కొరియాలో రూల్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మృతులు కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ఆర్మీ దళాలు సంతాపం తెలిపాయి.