ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.
అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు.
NEET Controversy: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు విద్యార్థిని తన ఇన్నర్‌వేర్‌ను తొలగించమని కోరిన ఘటనకు సంబంధించి ఎన్‌టీఏ పరిశీలకుడితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని విప్పించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లోదుస్తులు తీశాకే పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ ప్రిజీ కురియన్ ఇసాక్, డాక్టర్ శ్యాంనంద్‌ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో […]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన రాజకీయ పార్టీకి చెందిన అన్ని జాతీయ స్థాయి విభాగాలు, సెల్స్‌ను తక్షణమే రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం వరకు 20,557 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,566 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.