Karnataka Ambulance Crash: ఘోర అంబులెన్స్ ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Ambulance Crash: కర్ణాటకలో ఓ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను బలంగా ఢీ కొట్టింది. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్ గేట్ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు. అప్పటికే అతివేగంతో వస్తున్న అంబులెన్స్ వర్షపునీరు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అంబులెన్స్‌లోని పరికరాలన్ని చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్ విప్పి మరీ..
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతో పాటు రోడ్డుపై ఉన్న టోల్‌గేట్ సిబ్బంది మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.
#Breaking | At Udupi – Karnataka, an ambulance lost it's control and met with an accident.
Shocking footage 😳#Udupi #Karnataka #Ambulance #Accident #CCTV pic.twitter.com/eyot7vz2pw
— Gobinath (@Itsme_Gobinath) July 20, 2022
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!