Cabinet Berth Offer: రూ.100 కోట్లకు మంత్రి పదవి ఆఫర్.. నలుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Berth Offer: మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది. దౌండ్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మంత్రివర్గ కసరత్తుకు సంబంధించిన చివరి తేదీ ఇంకా చర్చలో ఉన్నప్పటికీ, పార్టీ అజెండాలో మంత్రివర్గ విస్తరణ చాలా ఎక్కువగా ఉందని, జులై నాలుగో వారంలో జరిగే అవకాశం ఉందని బీజేపీలోని అంతర్గత వర్గాలు తెలిపాయి.
రాజకీయ పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు నలుగురు నిందితులు కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తామని ముగ్గురు ఎమ్మెల్యేలను మోసం చేసేందుకు ప్రయత్నించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన నిందితులు కొల్హాపూర్‌కు చెందిన రియాజ్ షేక్ (41) సంవత్సరాలు, కొల్హాపూర్), యోగేష్ కులకర్ణి (57), సాగర్ సంగ్వాయ్ (37), జాఫర్ అహ్మద్ ఉస్మానీలుగా గుర్తించారు. జులై 12న రియాజ్ షేక్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఓ ఆఫర్‌పై చర్చించేందుకు మిమ్మల్ని కలవాలని రియాజ్ కోరాడని ఎమ్మెల్యే రాహుల్ కుల్ తెలిపారు. ముంబైలోని హోటల్‌లో కలిసిన రియాజ్ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేశాడని, ఓ సీనియర్ రాజకీయ నేత ఈ పని చేస్తాడని అందుకు ఆయనకు రూ.100 కోట్లు చెల్లించాలని చెప్పాడని తెలిపారు. 20 శాతం డబ్బును అడ్వాన్స్‌గా చెల్లించాలని రియాజ్ డిమాండ్ చేశాడని చెప్పారు. అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధమని మనం తర్వాత కలుద్దామని చెప్పానని రాహుల్ కుల్ తెలిపారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం
ఈలోగా రియాజ్ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ ఆపై మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫనసల్కర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. ఇక ఎమ్మెల్యే నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు హోటల్‌కు రావాలంటూ నిందితులపై వలపన్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జులై 26 వరకూ పోలీస్ కస్టడీకి తరలించారు. వీరు ఇంతకు ముందు మరెవరినైనా మోసం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!