తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ఓ వ్యక్తి దొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వందలాది మంది ఇరాకీ మత గురువు ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులు శనివారం బాగ్దాద్‌లోని భారీ పటిష్టమైన పార్లమెంట్ భవనంపై దాడి చేసి ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని నిరసించారు. ఇరాన్ అనుకూల పార్టీలు తమ దేశ ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ.. ఇరాక్‌లో వందలాది మంది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్‌ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో పట్టుబడిన డ్రగ్స్‌ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది.
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఆయన మాటలతో తాము ఏకభవించమని ముఖ్యమంత్రి షిండే అన్నారు. కోశ్యారీ రాజ్యాంగాబద్ధమైన పదవిలో ఉన్నారని.. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు.
ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 600 ఎకరాల్లో 423 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను ప్రధాని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల కేంద్రంలో వర్చువల్‌గా ప్రారంభించారు.
పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఫరిద్‌కోట్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రతపై ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపై మీడియాతో కలిసి ఆయన గురు గోవింద్‌సింగ్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిని సందర్శించారు.