కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన ఇథియోపియన్ పౌరుడికి మంకీపాక్స్‌కు బదులుగా చికెన్‌పాక్స్ ఉన్నట్లు నిర్ధారించబడింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ ప్రకారం.. ఇథియోపియన్ పౌరుడు ఈ నెల ప్రారంభంలో మంకీపాక్స్ లక్షణాలతో బెంగళూరు విమానాశ్రయంలో దిగగా.. అతనిని పరీక్షల కోసం పంపించారు.
రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలను వరదలు ఎంతో నష్టానికి గురిచేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై మాట్లాడారు. వరద నష్ట పరిస్థితిపై సమీక్షించేందుకు వెంటనే వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ ఈ సమస్య జటిలమవుతోందన్నారు.
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాస్తున్నట్లు చికోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఉదయం నుండి ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేసినట్లు భయాందోళనకు గురవుతున్నారు. బిల్డింగ్ చుట్టూ చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు.
ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు.
రికార్డు స్థాయిలో పెరిగిన ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ఆందోళలనకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది.
దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసి ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన కుటుంబసభ్యులకు విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని అందరికంటే ముందుగా విమానం నుంచి దింపేందుకు విమాన సిబ్బంది ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కనీసం పట్టించుకోలేదు.
స్పెయిన్‌లో మంకీపాక్స్ కారణంగా తొలి మరణం సంభవించిన 24 గంటల్లోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. యూరప్‌లోనే ఇది రెండవ మరణంగా నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో మంకీపాక్స్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. ఆ దేశంలో ఇప్పటి వరకు 4298 మంది వ్యాధి బారిన పడ్డారు.