రష్యాలోని మాస్కోలో 15 అంతస్తుల భవనంలో రాత్రిపూట జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఘటనా సమయంలో ఫైర్ అలారం పనిచేయలేదని అధికారులు తెలిపారు. మాస్కోలోని ఆగ్నేయం దిశగా ఉన్న ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని.. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
మహారాష్ట్రలో ముంబైలోని శివాజీ నగర్ బైగన్‌వాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం నలుగురు శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు.
సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ పాప్ సింగర్ షకీరా ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. 2012 - 2014 మధ్యకాలంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి 14.5 మిలియన్ యూరోల పన్నులు చెల్లించడంలో విఫలమైనందున 2018లో స్పానిష్ ప్రాసిక్యూటర్లు ఆమెపై అభియోగాలు మోపారు.
ఇప్పటివరకు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా ప్యాకెట్లపై 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' అనే హెచ్చరిక ఉండేది. ఇకపై కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది.
శ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్‌లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆమెకు చెందిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎవరైనా రెండు మూడు రోజులు స్నానం చేయకపోతేనే ఒంటిపై ఏదో పాకినట్లుగా విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు దుర్వాసన వెదజల్లుతుంది. చర్మం పాడవుతుంది. కానీ బిహార్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతని శరీరం దుర్వాసన లేదు, మరియు అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు.
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది.
ఎప్పుడూ యుద్ధం గురించి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అమెరికాతో కయ్యానికి కాలు దువ్వే విధంగా ఆయన మాట్లాడారు. కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ అన్నారు.