IND vs PAK: ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’.. మళ్లీ రేపు ఇదే రిపీట్ కావాలి..
- రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్..
- శివరాత్రి రోజు మరోసారి దాయాదుల సమరం..
- ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: 23 ఏళ్ల క్రితం సచిన్ పాకిస్తాన్‌పై ఆడిన ‘‘శివ తాండవం’’ వరల్డ్ క్రికెట్‌లోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ అయింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఈ మ్యాచ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు, కానీ 90వ తరానికి మాత్రం ఈ మ్యాచ్ ద్వారానే క్రికెట్ పరిచయమైందంటే అతిశయోక్తి కాదు. మార్చి 1, 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఈ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోరు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి నిప్పులు చెరిగే బాల్స్, సచిన్ ముందు చిన్నబోయాయి. శివరాత్రి రోజు పాకిస్తాన్‌ను బౌలర్లను సచిన్ టెండూల్కర్ చీల్చి చెండాడారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా సచిన్‌కు సెహ్వాగ్ జతకట్టి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
23 ఏళ్ల తర్వాత మరోసారి శివరాత్రి రోజే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది కూడా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ కావడం విశేషం. కానీ అప్పుడు వన్డే అయితే, ఇప్పుడు టీ20. ఈ శివరాత్రి కూడా ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’ కావాలని యావత్ భారత్ కోరుకుంటోంది.
Also Read
- IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
శివాలెత్తిన సచిన్:
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. తరువాతి రౌండ్ క్వాలిఫైయింగ్ బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ 126 బాల్స్ లో 101 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణం అయ్యాడు. అయితే అప్పటి వరకు భారత్ కు 222 కంటె ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఎన్నడూ కూడా విజయవంతంగా ఛేదించలేకపోయిన భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇంత పెద్ద టార్గెట్‌ను భారత్ ఛేదించలేదని పాక్ జట్టు అంచనాలు మొదటి 5 ఓవర్లలోనే పటాపంచలయ్యాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిగా వచ్చారు. ఇద్దరు వచ్చీ రావడంతోనే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. టీ 20 ఫార్మాట్ అంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే హిట్టింగ్ చేస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో సచిన్ ఆడిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికే ఓ క్లాసిక్. సచిన్ ఆడిన షాట్ నే మళ్లీ సెహ్వాగ్ పాక్ బౌలర్లకు రుచి చూపాడు.
సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ వికెట్లు త్వరగానే పడిపోయినా.. మహ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ జట్టును విజయతీరాలకు చేర్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో సచిన్ కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులు చేయడంతో పాటు వన్డేల్లో 12,000 పరుగులను పూర్తి చేశాడు. 27వ ఓవర్ లో షాహీద్ అఫ్రీదీ బౌలింగ్ లో సచిన్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తరువాత ద్రావిడ్ 44 పరుగులతో, యువరాజ్ సింగ్ 50 పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. 6 వికెట్ల నష్టానికి మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!