Punjab Minister: దూకుడుగా ప్రవర్తించిన మంత్రి.. అవమానంగా భావించి వైస్ ఛాన్సలర్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Minister: పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఫరిద్‌కోట్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో అపరిశుభ్రతపై ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపై మీడియాతో కలిసి ఆయన గురు గోవింద్‌సింగ్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆయన వెంటే బాబా ఫరిద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆ ఆసుపత్రి వాతావరణం చూసిన మంత్రి ఆగ్రహానికి గురై.. బహదూర్‌తో మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా కాస్త దూకుడుగా ప్రవర్తించారు. ‘ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది’ అంటూ వైస్‌ఛాన్సలర్‌ను ఆసుపత్రి బెడ్‌పై పడుకోమన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నలుగురి మధ్య కెమెరా ఎదుట జరిగిన ఈ చర్యను ఆ వైద్యాధికారి తీవ్ర అవమానంగా భావించారు. శుక్రవారం ఈ ఘటన జరగగా.. ఇవాళ ఆయన ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపారు.
మంత్రి చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వైస్ ఛాన్సలర్ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అవమాకరమైందని, ఇది వైద్య వృత్తిని అగౌరవపర్చడమేనని నిరసించింది భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి డిమాండ్ చేశాయి. ఈ ఘటనను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత పర్తాప్ సింగ్ బజ్వా ఖండించారు. “పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రజల దృష్టిలో మంత్రి యొక్క ఈ అనాలోచిత ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలి. అతనికి మార్చింగ్ ఆదేశాలు ఇవ్వాలి. ఇంకా, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చిత్తశుద్ధితో ఆలోచించి, ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఆప్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును చెడగొట్టకుండా ఉండండి” అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మరో సీనియర్ కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ ఔజ్లా కూడా ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేయాలని పంజాబ్ సీఎంను కోరారు. “భగవంత్ మాన్‌జీ, ఆరోగ్య మంత్రి బలహీనమైన మనస్తత్వం, రాజకీయ దివాళాకోరుతనం ఫలితంగా సీనియర్ వైద్యుల నిరసన రాజీనామాలు ఉన్నాయి. మంత్రి చర్యలపై వెంటనే నోటీసు ఇవ్వాలని నేను సూచిస్తున్నాను. మా వైద్యులందరూ గౌరవానికి అర్హులు.” అని ఔజ్లా ట్వీట్ చేశారు. శిరోమణి అకాలీదళ్ నేతలు కూడా రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలని కోరారు.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఈ ఘటనను ఖండించారు. “యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఆరోగ్య మంత్రిని భర్తరఫ్ చేయాలని.. ఆ వైస్ ఛాన్సలర్ రాజీనామాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ వైద్యుడికి క్షమాపణలు చెప్పాలని సీఎం భగవంత్ మాన్‌ను కోరుతున్నాను. ఈ ఘటన పంజాబ్‌లో ఆరోగ్య సేవలను దెబ్బతీస్తుంది.” అని కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ట్వీట్ చేశారు.
పంజాబ్ ఆరోగ్య మంత్రి జౌరమజ్రా, బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్‌ను మురికిగా ఉన్న పరుపుపై పడుకోమని ఆదేశిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రుల దుస్థితిపై మంత్రి ఆయనపై విరుచుకుపడ్డారు.
Cheap theatrics of Aam Aadmi Party never ceases. Today the Vice Chancellor of Baba Farid Medical University,Raj Bahadur Singh was publicly humiliated by the Health minister Chetan Singh Jouramajra (+2 Pass).This type of mob behaviour will only demoralise our medical staff. pic.twitter.com/ZGJCbEPjhm
— Pargat Singh (@PargatSOfficial) July 29, 2022
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!