బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ శుక్రవారం నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టారు. పులుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. మూడు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు కుమార్ కేశరి, విక్రమ్, మగద్, రాణి పేర్లను పెట్టినట్లు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను విడుదల చేసే విషయంలో వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తారని ప్రతీతి. మెగా కాంపౌండ్ లో ఎంతోమంది హీరోలు ఉన్న కారణంగా, తమ కుటుంబంలోని ఓ హీరో సినిమాకు మరో హీరో చిత్రం పోటీ కాకూడదనీ ఆయన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అలాంటి చిరంజీవి నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి.
భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో శుక్రవారం కారు టెంపోను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టెంపో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ఎన్నికైన తర్వాత శివసేనపై పట్టు కోసం పోరాడుతున్న ఉద్ధవ్ ఠాక్రేకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ క్రమంలోనే షిండే ఉద్ధవ్ వర్గానికి మరో షాకిచ్చాడు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడైన నిహార్ థాక్రే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివాదాస్పద "రాష్ట్రపత్ని" వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. "నోరు జారి అలా మాట్లాడానని హామీ ఇస్తున్నాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నాను. మా క్షమాపణలను అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను." అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.
వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని జైలుపై ఉక్రెయిన్ అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లతో దాడి చేసిందని, 40 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారని, 75 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం 12 ఏళ్ల బాలిక 500 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 5 గంటల పాటు ఆర్మీ, పోలీసు బృందాలు శ్రమించి ఎట్టకేలకు ఆ బాలికను రక్షించారు. ఈ ఘటన ధృంగాధ్ర తహసీల్‌లోని గజన్వావ్ గ్రామంలో చోటుచేసుకుంది.