పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జల్పేష్‌కు వెళుతున్న పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై 10 మంది మరణించినట్లు ఆదివారం అర్థరాత్రి పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్‌లో ఉన్న 27 మందిలో 16 మంది వ్యక్తులకు స్వల్ప గాయాలైనందున చికిత్స కోసం జల్‌పైగురి ఆసుపత్రికి తరలించారు.
కేరళలో మంకీపాక్స్ మరణం కలకలం రేపుతోంది. దీనితో భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైనట్లైంది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు వైరస్‌తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
కేంద్ర మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి భట్లపెనుమర్రు గ్రామంలో పర్యటిస్తున్న సమయంలోనే జాయిట్ కలెక్టర్ వెళ్లి పోవడంతో కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యలపై మాట్లాడే సమయంలో జాయింట్ కలెక్టర్ ఎక్కడ? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ (94)ఆదివారం మధ్యాహ్నం కొవిడ్ సమస్యల కారణంగా మరణించారు. కరోనా సమస్యల కారణంగా ఆయన మకాటి మెడికల్ సెంటర్‌లో మృతి చెందారని మనీలా టైమ్స్ నివేదించింది.
వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మెలోకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 6 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారని ఆయన తెలిపారు. యూనివర్సిటీని పోలీసులు క్యాంపుగా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ లేదు, ల్యాప్‌టాప్‌లు లేవని, మెస్ సైతం సరిగ్గా లేదన్నారు.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
జాతీయ జెండాకు ప్రాణం పోసింది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లానేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 'ఆజాదికా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో 'మోదీ@2.0' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. 2014లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు.
ముంబైలోని పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో గంటల కొద్దీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా రౌత్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం రౌత్ నివాసానికి చేరుకుంది.