గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఇప్పటివరకు 1,200లకు పైగా పశువులు లంపి చర్మవ్యాధితో చనిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తెలిసింది. ప్రభుత్వం చికిత్సతో పాటు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిందని, అదే సమయంలో జంతు ప్రదర్శనలను కూడా నిషేధించిందని అధికారులు ఆదివారం తెలిపారు.
తనకు ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖల నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ఆయుధాల లైసెన్స్ జారీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో కూడా మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో16,464 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు భారీగా తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 39 మంది కరోనా బారినపడి చనిపోయారు.
చర్మంపై దద్దుర్లు, జ్వరం వంటివి మంకీపాక్స్, చికెన్‌పాక్స్ రెండింటిలో సాధారణ లక్షణాలు కావడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తమకు సోకింది ఏ వైరస్ అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు వైరల్ వ్యాధుల లక్షణాలు రోగులలో వ్యక్తమయ్యే విధానంలో తేడా ఉందని వైద్యులు వెల్లడించారు.
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు కొంతమేరకు తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
కామన్‌వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో వచ్చినవే కావడం గమనార్హం.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు.
వసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పత్రాచల్ భూకుంభకోణంలో నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు ప్రకటించారు.