NOIDA LOVE DEATH: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు.. ఇంతలోనే
- నోయిడా సెక్టార్ 107.. పట్టపగలే కాల్పుల శబ్దం
- చనిపోయిన మహిళ పేరు 26 ఏళ్ల రేఖగా గుర్తించారు
- కారులో చనిపోయి ఉన్న వ్యక్తి ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన సుమిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో హఠాత్తుగా విగతజీవులుగా కారులో పడి ఉన్నారు. ప్రేమికుల రోజునే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నోయిడాలో జరిగింది. అసలు ఆ ప్రేమికులకు వచ్చిన కష్టమేంటి? వారు ఎలా చనిపోయారు? పోలీసులు ఏం చెబుతున్నారు?
Also Read:Peddi Update: గ్రౌండ్‌లోకి దిగిన గ్లోబల్ స్టార్ టీమ్.. స్పోర్ట్స్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న ‘పెద్ది’ !
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అది నోయిడా సెక్టార్ 107.. పట్టపగలే కాల్పుల శబ్దం.. ధనాధన్.. రెండు బుల్లెట్లు కాల్చిన సౌండ్.. ఈ కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయని చూసే సరికి ఓ కారు నుంచి వినిపించినట్లుగా గుర్తించారు.. స్థానికులు కారు వద్దకు చేరుకునే సరికి.. జంట శవాలు కనిపించాయి. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి.. కారు లోపలి నుంచి లాక్ చేసి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అద్దాలు పగులగొట్టి ఇద్దరినీ బయటకు తీశారు. వారు అప్పటికే చనిపోయి ఉన్నారు.
కారులో ఉన్న వ్యక్తి చేతిలో పిస్టల్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దాంతోపాటు కారులో రెండు వాడకుండా ఉన్న ఖాళీ కార్ట్రిడ్జ్‌లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరికి చెందిన మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో హత్య.. ఆ తర్వాత ఆత్మహత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. చనిపోయిన మహిళ పేరు 26 ఏళ్ల రేఖగా గుర్తించారు. ఆమె నోయిడా సెక్టార్ 58లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. కారులో చనిపోయి ఉన్న వ్యక్తి ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన సుమిత్ అని చెబుతున్నారు పోలీసులు.
రేఖ.. శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. తెలిసిన వాళ్ల ఇళ్లు, బంధువులను వాకబు చేసిన తల్లిదండ్రులు చివరికి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నోయిడా సెక్టార్ 107లో శవంగా కనిపించే సరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు సుమిత్ తండ్రి రాజీవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సుమిత్, రేఖ పాఠశాలలో కలిసి చదువుకున్నట్లుగా తెలుస్తోంది. వారు అప్పటి నుంచే.. అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
సుమిత్ క్రికెట్ ఆడటమే కాకుండా వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని కూడా నిర్వహించేవాడని బంధువులు చెబుతున్నారు. అంతే కాదు.. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రేఖ కోసం దాదాపు కోటి రూపాయల విలువైన ఫ్లాట్ కొన్నాడని తెలిపారు. త్వరలో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్న తరుణంలోనే ఇలా జరగడంపై సుమిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:Mahashivratri 2026 Puja Samagri List: మహాశివరాత్రి పూజకు అవసరమైన పూజా సామాగ్రి పూర్తి లిస్ట్ ఇదిగో..
ఘటనా స్థలం నుంచి DL 14 CL 6473 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే ప్రేమికుల రోజునే ఇద్దరూ చనిపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!