Hyderabad Horror: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నరరూప రాక్షసులు.. కారుతో ఢీకొట్టి.. 700 మీటర్లు ఈడ్చుకెళ్లిన పోకిరీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Horror: హైదరాబాద్‌లో రోజు రోజుకు పోకిరీల అగడాలు శ్రుతి మించుతున్నాయి. రాత్రిపూట రోడ్ల మీద నడవాలన్నా.. వాహనాల్లో వెళ్లాలన్నా సామాన్య జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో పోకిరీ వెధవలు.. సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నారు. సామాన్య జనం.. రోడ్డులో వెళ్తుండగానే పక్కనే రయ్ రయ్ మంటూ బైకుల మీద హడలెత్తించేలా దూసుకు వెళ్లడం, మహిళలను అసభ్యంగా తాకుతూ వెళ్లడం, వంటి పనులతో హైదరాబాద్ సిటీతోపాటు శివారులోనూ పోకిరీలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నా.. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కుషాయిగూడలో ఇలాంటి ఘటనే జరిగింది. పోకిరీలు చేసిన ఆగడాలు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. కారుతో ఢీకొట్టిన రాస్కెల్స్.. అలాగే అతన్ని దాదాపు 700 మీటర్ల వరకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఆయన పోరాడుతున్నారు.
READ ALSO: NOIDA LOVE DEATH: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదామని నిర్ణయించుకున్నారు.. ఇంతలోనే
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆయన పేరు సతీష్. ఇతనే పోకిరీల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ సైరన్ అమర్చిన బొలెరో కారు.. అతని కారును వెనుక నుంచి ఢీకొట్టింది. అంతే కాదు ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు అందులోని యువకులు. దీంతో ఆగ్రహించిన సతీష్.. ఆ యువకులను కొంతదూరం వరకు వెంబడించారు. కారులో సతీష్ ఫ్రెండ్ కూడా ఉండడంతో ఆ పోకిరీల కారును వీడియో తీశారు. అనంతరం బొలెరో కారును ఆపి మాట్లాడే ప్రయత్నం చేశారు.
అయితే బొలెరో కారుకు ఎదురుగా నిలబడి వివరణ కోరుతున్న సమయంలోనే.. అందులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. అత్యంత వేగాన్ని లంఖించుకుంటూ.. సతీష్‌ను మళ్లీ కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సతీష్.. వారి కారు బంపర్‌ను పట్టుకున్నారు. కారు వేగంగా వెళ్తుండడంతో కిందకు జారిపోయాడు. అతని వీపు నేలకు రాసుకుంటూ వెళ్తోంది. అయినా కారులోని పోకిరీలు కారు ఆపలేదు. మరోవైపు సతీష్ మిత్రుడు.. కారు ఆపాలని గట్టిగా అరుస్తున్నా.. ఆ రాస్కెల్స్ పట్టించుకోలేదు. వేగం తగ్గించకుండా దాదాపు 700 మీటర్ల వరకు అలాగే ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటనలో సతీష్ వీపునకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రైవేట్ భాగాలు సైతం దెబ్బతిన్నాయి. ఒక కాలు విరిగిపోయి శస్త్రచికిత్స అవసరమయ్యే స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో సతీష్‌తో మాట్లాడినప్పుడు జరిగిన దారుణాన్ని వివరించే వీడియో కూడా బయటకు వచ్చింది.
బొలెరో కారుకు సైరన్ ఎందుకు అమర్చారు? కారులో ఉన్న యువకులు ఎవరు? వారు మద్యం తాగారా? లేక గంజాయి మత్తులో ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదని సతీష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద సైరన్ మోగిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వీడియోలను కూడా స్థానికులు రికార్డ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయోనని అంటున్నారు స్థానికులు.
READ ALSO: Chiranjeevi – Mega 158: మెగా ఛాన్స్ కొట్టేసిన ఛాంపియన్ హీరోయిన్.. !
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!