పాకిస్తాన్‌లో వాయువ్య ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో సోమవారం రాత్రి అదృశ్యమైన పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్.. లాస్బెలా జిల్లాలోని మూసా గోత్ సమీపంలో కుప్పకూలినట్లు పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం మంగళవారం తెలిపింది.
అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని రష్యా అమెరికాను హెచ్చరించింది. అయితే పెలోసి ఇంకా ద్వీపాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి.
మహీంద్ర గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒక్క వ్యాపారంలోనే కాదు నెట్టింట కూడా చురుకుగా ఉంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా తమ కస్టమర్ ట్వీట్‌కు స్పందించి మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. లాంగ్‌జంప్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు క్వాలిఫికేషన్ రౌండ్ల నుంచి ఫైనల్‌కు చేరుకున్నారు. భారత అథ్లెట్లు మురళీ శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియాకప్ మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఏసీసీ(ఏసియన్ క్రికెట్ కౌన్సిల్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది.
బాల్యం నుంచే మతంపై ఆసక్తి పెంచుకున్న అల్ జవహరి.. మతపరమైన అంశాలను గమనించేవాడు. కంటి వైద్యుడైన అల్ జవహరి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం మొత్తం తిరిగాడు. సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కళ్లారా చూశాడు. ఆ సమయంలోనే యువకుడైన ఒసామా బిన్ లాడెన్‌ను, సోవియట్ బలగాలను ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టేందుకు సాయపడుతున్న అరబ్ తీవ్రవాద గ్రూపులను కలిశాడు.
ఐకూ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ 9టీ 5జీ మంగళవారం భారత్‌లో లాంఛ్ అయింది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పాటు అన్ని విభాగాల్లో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడంతో మంకీపాక్స్ నిర్ధారణైంది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో భెజ్జీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హద్మా అలియాస్ సంకు మృతి చెందినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వారణాసీ జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురి అయిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.