Heavy Rain: నగరంలో మరోసారి దంచికొట్టిన వర్షం.. రోడ్లన్నీ జలమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం దాదాపు గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, సికింద్రాబాద్, బేగంపేట, దిల్సుఖ్నగర్, చాదర్‌ఘాట్ ఎల్బీనగర్, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా బయటకు వచ్చిన వారంతా భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Kishan Reddy: వెంకయ్య గ్రామంలో అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
Also Read
- Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
- Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
- Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
- Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు పైనే మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి చేరిన నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది.
తాజావార్తలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!