ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత సాధించారు. ఐక్యరాజ్యసమితిశాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కాంబోజ్ బాధ్యతలను స్వీకరించారు.
బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సెన్సేషనల్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు.
భారత స్వాతంత్య్ర సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే సోదాలు మొదలైనట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 17,135 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 47 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 19,823 మంది కోలుకున్నారు.
మద్యం మత్తు ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ వినరు. చాలా మంది మందుబాబులు అదే పనిగా మందు తాగుతూ వేరే లోకంలో ఉంటారు. అలా తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది.
అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు.