దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 20,551 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 70 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 21,591 మంది కోలుకున్నారు.
రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వైపు పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో సీడబ్ల్యూసీ మెంబర్లు, జాతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్‌ను పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్‌కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 20 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే (ఆరో రోజు) భారత్ 20 పతకాలు (6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు) సాధించింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని పలువురితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడి స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్వామీజీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అనగానే.. వెంటనే మఠాధిపతి కలుగుజేసుకుని దానిని సరిజేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
హనుమాన్ జయంతి వేడుకలో హింసను ప్రేరేపించిన ఇతర సహ నిందితులతో కలిసి జహంగీర్‌పురి అల్లర్లలో ఓ కీలక నిని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ మంగళవారం అరెస్టు చేసింది. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి నాడు ఊరేగింపు సందర్భంగా నిందితుడు సన్వర్ అలియాస్ అక్బర్ అలియాస్ కాలియా, ఇతర నిందితులు ప్రజలను రెచ్చగొట్టి, ఎదుటి పక్షంతో పాటు అక్కడ మోహరించిన పోలీసు సిబ్బందిపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు.