Advocate Swapna Murder Case: పక్కా స్కెచ్‌తో చెల్లిని అంతమొందించిన అన్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Advocate Swapna Murder Case: రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్ స్వప్న మర్డర్ సంచలనం సృష్టించింది. భూమి కోసం సొంత అన్ననే ఆమెను అంతమొందించాడు. ప్రస్తుతం అరెస్టై జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఐతే స్వప్న మర్డర్ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. స్వప్న హత్యని ప్రమాదంలా చిత్రీకరించి చెల్లిని వదిలించుకోవాలనుకున్న సొంత అన్న క్రూరత్వం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నాయని పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఆమెపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది.. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.
READ ALSO: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
స్వప్న కేసులో ఆమె అన్న రాజు మాత్రమే కాదు.. శేఖర్ అనే వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించాడు. అతన్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. స్వప్న ఎక్కడ ఉంది? ఎటు వెళ్తోంది? అనే లైవ్ లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు నిందితుడు, స్వప్న సొంత అన్న రాజుకు చేరవేసే బాధ్యతను శేఖర్ తీసుకున్నాడు. అలా పంపడంతోనే అన్న రాజుతోపాటు నిందితులంతా స్వప్నను మట్టుబెట్టగలిగారు. కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తులతో దాడి చేసి చంపేశారు. తీవ్ర గాయాలతో స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఇప్పటివరకు స్వప్న హత్య కేసులో అన్న రాజుతో పాటు వీరేశ్, శివ, శేఖర్ అనే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు రాజు ఒప్పుకొన్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. స్వప్నను చంపడానికి గతంలోనే రెండుసార్లు స్కెచ్ వేసినట్లు అతను విచారణలో వెల్లడించాడు. కారుతో ఢీకొట్టి చంపాలని చూసినట్లు తెలిపాడు. ఏకంగా బుల్డోజర్‌తో తొక్కించి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. అదృష్టవశాత్తూ ఆ రెండు ఘటనల నుంచి స్వప్న తప్పించుకోగలిగింది. ఐతే పలుమార్లు వరుస విఫలయత్నాల తర్వాత.. ఈసారి ఎలాగైనా చంపాలని గట్టిగా స్కెచ్చేశారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుని.. పక్కా స్కెచ్‌తో చంపేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!