Monkeypox: భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: మంకీపాక్స్ కేసులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. దేశంలో కూడా మంకీపాక్స్ రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 8 మంది మంకీపాక్స్ బారినపడగా.. ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది. వ్యాధి వ్యాప్తి నివారణకు చేయాల్సినవి, చేయకూడనివి అంటూ పలు సూచనలు చేసింది. మంకీపాక్స్ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలని.. వ్యాధి బారిన పడకుండా ఉండేందురు ఏం చేయాలో.. చేయకూడదో తెలుసుకుందామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.
Dollars: అప్పడాల మాటున అమెరికా డాలర్లు..!
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
కేంద్రం చేసిన సూచనలు: మంకీపాక్స్ వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసోలేషన్‌లో ఉండాలి. బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజర్ రాసుకోవాలి. మంకీపాక్స్ బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతకకూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు.
Protect yourself from #Monkeypox. Know what you should and should not do to avoid contracting the disease.
For more information, visit https://t.co/4uKjkYncqT pic.twitter.com/Zz9tYec9JR
— Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2022
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!