విద్వేషాలకు ప్రేమ అతీతమంటూ రష్యాకు చెందిన అబ్బాయి, ఉక్రెయిన్‌కు చెందిన అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ యుద్ధం ఈ ప్రేమ జంటను విడదీయలేకపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన యువతి, రష్యాకు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Ind vs Wi: వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ పైన కూడా కన్నేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 తేడా భారత్ ముందంజలో ఉంది. ఇవాళ జరగనున్న నాలుగో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ భారత్ వశం కానుంది. ఇవాళ్టి టీ20 మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్ […]
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలను గెలుచుకున్న భారత్‌కు శుక్రవారం రెజ్లింగ్‌లో ఓ అద్భుతమైన రోజు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నిలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు.
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇటీవల తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ విజయవంతంగా ముగించారు. తాజాగా మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు.
దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి కొవిడ్ వేరియంట్ మ్యుటేషన్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా విడుదల కాలేదు.
ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు.
పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. ఎనిమిదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశంలో వ్యక్తులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువల ధరలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.