Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 17,135 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు తాజాగా 47 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 19,823 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలో 4,64,919 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,26,477 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,37,057 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,34,03,610 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,67,144కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 23,49,651 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 8,21,908 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 1,938 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 583,944,874 కు చేరింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 64,18,751 మంది మరణించారు. ఒక్కరోజే 1,087,782 మంది కోలుకున్నారు.