Ryan Burl: ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ryan Burl: బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సెన్సేషనల్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్పిన్నర్ నసుమ్ అహ్మద్ వేసిన 15వ ఓవర్‌లో ర్యాన్ బర్ల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన ర్యాన్.. ఆ తర్వాతి బంతికి ఫోర్ సాధించాడు. చివరి బంతికి ఏమవుతుదా అని ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఆ బంతిని ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లేట్లు సిక్సర్ బాదాడు. దీంతో ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
అంతకంటే ముందు భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సులు బాదిన సంగతి తెలిసిందే. ఆపై విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ సైతం శ్రీలంక బౌలర్ అకిల ధనంజయపై విరుచుకుపడి 36 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సైఫర్ట్, భారత యువ ఆటగాడు శివమ్ దూబే 34 పరుగులు సాధించగా.. తాజాగా ర్యాన్ బర్ల్ ఆ జాబితాలో చేరాడు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
Common Wealth Games 2022: కామన్‌వెల్త్‌లో భారత్.. నేడు జరిగే పోటీలు
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో చెరో జట్టు గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బర్ల్ హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. బర్ల్ 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. న్యూచీ 20 బంతుల్లో 35 పరుగులతో విజృంభించడంతో జట్టు స్కోరు 156కు చేరింది. 157 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది.
Special moments, leading to a special win 🇿🇼❤️ https://t.co/VovIkwFUi8
— Ryan Burl (@ryanburl3) August 2, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు