Vice President Election: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మంగళవారం ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు తన పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎట్టకేలకు దానికి ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అదే పరిస్థితి కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయని మాయావతి హిందీలో ట్వీట్ చేశారు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించుకుందని.. దానిని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ఆమె మరో ట్వీట్‌లో జోడించారు.
Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10, 2022తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక జరగనుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాయి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ధన్‌కర్1989లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. జూలై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు. ముందుగా, బిజూ జనతాదళ్ (బీజేడీ) రాబోయే ఎన్నికల్లో ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటుందని ప్రకటించింది. 2017లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ప్రతిపాదించింది. ఆయన భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతి అయ్యాడు.