ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 13 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
మంగళవారం సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో సూర్య కుమార్ యాదవ్(44 బంతుల్లో 76 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో పాటు రిషభ్ పంత్ అజేయంగా 33 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు మంగళవారం కామన్వెల్త్ క్రీడల్లో పసిడి మోత మోగించారు. అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన అమ్మాయిలు లాన్‌బౌల్స్ ఫోర్స్ విభాగంలో చారిత్రాత్మక విజయంతో తొలి స్వర్ణాన్ని అందించారు.
నోకియా బ్రాండ్ లైసెన్సీ హెచ్‌ఎండీ గ్లోబల్ ద్వారా నోకియా 8210 4జీ ఫీచర్ ఫోన్ మంగళవారం భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ ఫోన్ రెండు విభిన్న రంగు ఎంపికలలో వస్తుంది.
చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆ వెంటనే చైనాకు వ్యతిరేకంగా స్పందించారు. తైవాన్‌ను ఏకపక్షంగా కలిపేసుకోవాలన్న చైనా చర్యలను అమెరికా వ్యతిరేకిస్తుందన్నారు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బస్సెటెర్రేలోని వార్నర్ పార్క్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు పతకాల పంట కొనసాగుతోంది. భారత హెవీ వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్ 96 కేజీల విభాగంలో రజతం సాధించి భారత్ పతకాల పంటలో మరో పతకాన్ని జోడించాడు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ మంగళవారం చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయం భారత్‌కు ప్రచారంలో నాల్గవ బంగారు పతకాన్ని అందించింది.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ బంగారు పతకంతో భారత్ మొత్తానికి నాలుగో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లెంది.