HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
- హైదరాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్లు, స్పాలు, మసాజ్ సెంటర్లు పక్కదారి
- ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చిన యువతులకు ఉద్యోగాలు అంటూ ఎర
- కూకట్‌పల్లి అడ్డాగా సాగుతున్న గలీజ్ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్లు, స్పాలు, మసాజ్ సెంటర్లు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వచ్చిన యువతులకు ఉద్యోగాలు అంటూ ఎర వేస్తున్నారు. చివరికి వారిని గలీజ్ దందాలోకి దించుతున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి ఓ ముఠా బాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. కూకట్‌పల్లి అడ్డాగా సాగుతున్న గలీజ్ దందా గుట్టు విప్పారు.
Also Read:Holiday After Maha Shivaratri 2026: శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
Also Read
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
వెల్‌నెస్ సెంటర్లు.. స్పా సెంటర్లు.. మసాజ్ సెంటర్లు.. వీటితో కొంత మంది అక్రమ దందా.. నిజానికి ఇవి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం స్వాంతన కలిగించేవి. కానీ ఇప్పుడు వీటి పేర్లతో కొంత మంది అక్రమ దందా చేస్తున్నారు. హైదరాబాద్‌లో రకరకాల పేర్లతో.. చివరకు ఆయుర్వేదం పేరును కూడా వినియోగించుకుని అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్‌లోనే కాదు మెట్రో సిటీల్లో రిచ్ లుక్‌తో కస్టమర్లను ఆకర్షించేందుకు అందంగా, స్టైలిష్‌గా సెంటర్లను తీర్చిదిద్దుతున్నారు. అలా అని లోపలికి వెళ్లారో.. మనకు తెలియకుండానే మాయమాటలతో నమ్మించి టెంప్ట్ చేస్తారు. ఇలాంటి వాటి లోపలికి వెళ్తే కానీ.. అసలు యవ్వారం అర్థంకాదు.
అంతా గబ్బు, గలీజు పనులు కోసమే ఇలాంటి సెంటర్లను కొంత మంది ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే ఎంతో మంది యువతులను ఇలాంటి వెల్‌నెస్ సెంటర్, స్పా సెంటర్‌ల నిర్వాహకులు ట్రాప్ చేసి పెట్టుకుంటారు. యువతులకు మాయమాటలు చెప్పి.. వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారిని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు.
ఇలా మెట్రో నగరాల్లోకి పొట్ట చేతపట్టుకొని వచ్చిన యువతులు.. తమకు తెలియకుండానే అసాంఘీక కార్యకలాపాల్లోకి దిగిపోతున్నారు. వారిని మసాజ్ థెరపిస్టుల పేరుతో కొంతమంది యువతులను నియమించుకుని క్రాస్ మసాజ్ చేయుస్తున్నారు. ఆ తర్వాత వారిని నెమ్మదిగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నారు నిర్వాహకులు. ఇందుకోసం కస్టమర్ల దగ్గర కూడా డబ్బులు బాగానే గుంజుతున్నారు.
తాజాగా కేపీహెచ్‌బీలోని రోడ్డు నెంబర్ 6 లోని గాయత్రిరెసిడెన్సీ.. సెకండ్ ఫ్లోర్‌లో ఆసనా వెల్‌నెస్ స్టూడియోలో జరుగుతున్న బాగోతంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఆసనా వెల్‌నెస్ స్టూడియో మెయిన్ రోడ్డుపై అపార్ట్‌మెంట్‌ల మధ్య ఉంది. అప్పటికే అక్కడ ఉన్న స్థానికులంతా వెల్‌నెస్ స్టూడియో దగ్గరికి పోలీసులు రావడంతో ఖంగుతిన్నారు. అప్పటి వరకు అక్కడే ఏం జరుగుతుందో తెలియక వారంతా ఆశ్చర్య పోయారు. వెల్‌నెస్ స్టూడియో నుంచి వరుసగా అమ్మాయిలతో పాటు మరి కొంత మందిని పోలీసులు బయటికి తీసుకువస్తుండటంతో అప్పటికి కానీ అర్థం కాలేదు. వెల్‌నెస్ స్టూడియో ముసుగులో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని జనం ఒక్కసారిగా షాకయ్యారు.
ఆసనా స్టూడియోపై దాడి చేసిన పోలీసులు లోపల జరుగుతున్న తతంగం చూసి ఆశ్చర్య పోయారు. అప్పటికే స్టూడియోలో రూముల్లో యువతీ యువకులు సగం బట్టలతో కనిపించడంతో.. వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని నిర్ధారించుకున్నారు. దీంతో ఆసనా వెల్ నెస్ స్టూడియో నిర్వాహకులతో పాటు మరో 18 మందికి పైగా విటులను, 15 మంది యువతులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వెల్‌నెస్ సెంటర్లు, స్పాలు నిర్వహించాలనుకునేవారు నిబంధనలో పాటించాలని పోలీసులు చెబుతున్నారు. క్రాస్ మసాజ్ చేయాలంటే కచ్చితంగా ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ఉండాలని లేదా ఓపెన్ డోర్ ఉండాలని, అలాగే థెరిపిస్ట్ సర్టిఫికెట్లు ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి నిబంధనలు ఎవరు పాటించక పోయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Also Read:Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
వెల్‌నెస్ స్టూడియోపై దాడి తర్వాత 42 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విటులపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులు ఇమ్రాన్‌తో పాటు మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. మణిపాల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ , పంజాబ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతులను సఖీ సెంటర్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!