Ruchira Kamboj: ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన రుచిరా కాంబోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruchira Kamboj: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత సాధించారు. ఐక్యరాజ్యసమితిశాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కాంబోజ్ బాధ్యతలను స్వీకరించారు. భారత్ పక్షాన ఐరాసలో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుట్రెస్ ట్వీట్ చేశారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళ ఆమే కావడం విశేషం. ఈ జూన్‌లో ఆమె నియామకం ఖరారు కాగా.. దానికి సంబంధించి పత్రాలను మంగళవారం ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు. ఆ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌కు శాశ్వత ప్రతినిధిగా నా పత్రాలను సమర్పించాను. భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే.. మనం ఏదైనా సాధించగలం’ అని ఆమె బాధ్యతలు స్వీకరిస్తోన్న చిత్రాన్ని షేర్ చేశారు.
Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఈ సందర్భంగా రుచిరా మనందరం సాధించగలం అని అమ్మాయిలకు సూచన చేశారు.రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికైన రుచిరా కాంబోజ్(58).. టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది సివిల్ సర్వీసెస్‌లో మహిళా విభాగంలో ఆమె ఆలిండియా మొదటి ర్యాంకు, ఫారిన్ సర్వీసెస్ విభాగంలో కూడా మొదటి ర్యాంకు సాధించారు. ఈ తర్వాత పారిస్‌లో మొదట బాధ్యతలు స్వీకరించి, దౌత్యాధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ మన దౌత్యకార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనంతరం రుచిరా ఢిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం మారిషస్, దక్షిణాఫ్రికా, భూటాన్ సహా మరికొన్ని దేశాల్లో సేవలు అందించారు.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!