Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 20 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇందులో 6 స్వర్ణాలు, 7రజతాలు, 7 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి. కామన్వెల్త్ క్రీడల్లో గురువారం భారత్ ఖాతాలో మరో స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు వచ్చి చేరాయి. భారత అథ్లెట్లు కామన్వెల్త్ క్రీడల్లో పతకాల మోగించారు. యువ అథ్లెట్, హైజంపర్ తేజస్విన్ శంకర్ సీనియర్ క్రీడల్లో పతకం గెలుచుకునే స్థాయికి ఎదిగి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ క్రీడల హైజంప్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు పుటలకెక్కాడు.లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ 8.08 మీటర్ల దూరంతో చారిత్రాత్మక రజతం గెలుచుకున్నాడు, లాంగ్‌జంప్‌లో కామన్వెల్త్ గేమ్స్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ పురుష అథ్లెట్‌గా నిలిచాడు.పారా-పవర్‌లిఫ్టర్ సుధీర్ కామన్వెల్త్ గేమ్స్‌లో పారా-పవర్‌లిఫ్టింగ్‌లో భారతదేశానికి మొదటి స్వర్ణం సాధించాడు. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. ఇవాళ కూడా పలు క్రీడల్లో భారత్‌కు చెందిన అథ్లెట్లు పాల్గొననున్నారు. మరి ఇవాళ ఏయే విభాగాల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారో తెలుసుకుందాం.
కామన్‌వెల్త్‌లో నేడు భారత్ పాల్గొనే క్రీడలు ఇవే..
హాకీ (మహిళలు, రా.10.30 గంటల నుంచి): భారత్ × ఆస్ట్రేలియా, సెమీఫైనల్
అథ్లెటిక్స్: జ్యోతి యర్రాజి, మహిళల 100 మీ.హర్డిల్స్ (మ.2.56 నుంచి); పురుషులు 4×400 మీ రిలే (సా.4.07 గంటల నుంచి); హిమదాస్, మహిళల 200 మీ. సెమీస్ (రా.12.45 గంటల నుంచి)
రెజ్లింగ్ (మ.3 గంటల నుంచి): బజరంగ్ పునియా, 65 కేజీలు; దీపక్ పునియా, 86 కేజీలు; సాక్షి మలిక్, 62 కేజీలు; అన్షు మలిక్, 57 కేజీలు; మోహిత్, 125 కేజీలు; దివ్య, 68కేజీలు
బ్యాడ్మింటన్ (మ.3.30 గంటల నుంచి): సింధు, మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్; శ్రీకాంత్, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్
టేబుల్ టెన్నిస్ (సా.5 గంటల నుంచి): ఆకుల శ్రీజ-రీత్, మహిళల డబుల్స్ తొలి రౌండ్