Jahangirpuri Violence Case: హనుమాన్ జయంతి వేడుకలో హింసను ప్రేరేపించిన ఇతర సహ నిందితులతో కలిసి జహంగీర్‌పురి అల్లర్లలో ఓ కీలక నిని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ మంగళవారం అరెస్టు చేసింది. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి నాడు ఊరేగింపు సందర్భంగా నిందితుడు సన్వర్ అలియాస్ అక్బర్ అలియాస్ కాలియా, ఇతర నిందితులు ప్రజలను రెచ్చగొట్టి, ఎదుటి పక్షంతో పాటు అక్కడ మోహరించిన పోలీసు సిబ్బందిపై రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. అల్లర్ల అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రూ.25వేల రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసుల బృందం అతడిని అరెస్ట్ చేసింది. సన్వర్ మాలిక్‌పై జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 186/353/332/34 కింద ప్రత్యేక కేసు నమోదు చేయబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల సన్వర్ 4వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అతను దొంగతనం వంటి నేరాలలో పాలుపంచుకోవడం ప్రారంభించాడు. అతని సోదరుడితో కలిసి హత్యకు ప్రయత్నించిన కేసులో 2016లో మొదటిసారి అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ అంతటా నేర కార్యకలాపాలు ప్రారంభించాడు. ఆరు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 16న జరిగిన జహంగీర్‌పురి హింసాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ జులై 14న ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Andhra Pradesh: ప్రేమించలేదని దారుణం.. యువతిని కారుతో ఢీకొట్టిన ఉన్మాది..
ఛార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు 37 మందిని అరెస్టు చేయగా, 8 మంది పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొన్నారు. వీరితో పాటు ఇద్దరు చిన్నారులను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. మైనర్ నేరస్థులపై ఢిల్లీ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) ముందు ప్రత్యేక ఛార్జిషీట్ దాశలు చేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. మూలాల ప్రకారం.. మహ్మద్ అన్సార్, తబ్రేజ్ అన్సారీలను ప్రధాన కుట్రదారులుగా పేర్కొన్నారు. తూర్పు మిడ్నాపూర్‌లోని అన్సార్ బంధువులను ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీసు బృందం పశ్చిమ బెంగాల్‌కు కూడా వెళ్లింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన మూడో ప్రధాన కుట్రదారు ఇష్రాఫిల్ అనే వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. ఇది కాకుండా, కోర్టు ప్రకటిత నేరస్థులుగా ప్రకటించి పరారీలో ఉన్న ముగ్గురి పేర్లను ఛార్జిషీట్ పేర్కొంది. పరారీలో ఉన్న కొందరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి రోజున హింసను ప్రేరేపించేందుకు నిందితులు ఏప్రిల్ 10న ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారని ఛార్జిషీట్ వెల్లడించింది. అరెస్టయిన వారి నుంచి అల్లర్లకు ఉపయోగించిన మొత్తం 15 కత్తులు, పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.