అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. పెరుగుతున్న కొవిడ్ కేసులపై ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఆరోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా మహిళామణులకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు 48 గంటల పాటు మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని కోఠార్ణే గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు భారత్ 26 పతకాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇందులో 9 స్వర్ణాలు, 8రజతాలు, 9 కాంస్య పతకాలు భారత్‌కు లభించాయి.
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. తమ 56వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వృద్ధ జంటతో సహా ముగ్గురు వ్యక్తులు శుక్రవారం వైట్‌హౌస్ సమీపంలోని పార్కులో పిడుగుపాటుకు గురై మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఢిల్లీలో పలు సమావేశాలకు హాజరుకావాల్సిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి శనివారం కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు.
భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ అల్వా బరిలో ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షియా నివాస ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.