మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్‌ను ఆ దేశం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కడంపై పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.అతని రచనలు, ప్రసంగాలకు ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరిస్తోంది.
ఉచిత హామీలు, పథకాలపై బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కార్పొరేట్ సంపన్నుల రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు.
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన సోదరి వెల్లడించారు. అయితే కిమ్‌కు కరోనా సోకిందా లేదా అన్నదానిపై ఆమె స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కిమ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఓ ప్రసంగంలో వెల్లడించినట్లు ఉత్తర కొరియా అధికార మీడియా తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
బిహార్‌లో బీజేపీతో ఉన్న బంధాన్ని తెంచుకున్న ఆర్జేడీ సహా మహాకూటమితో కలిసి 8వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆయన బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.
తమిళనాడులోని చెన్నైలో గల పోరూర్ ప్రాంతానికి సమీపంలో కారులో వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి నగలను కూడా నిందితులు ఎత్తుకెళ్లారని వెల్లడించారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షం వరదలకు కారణమైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా 2,682 భవనాలు, అపార్ట్‌మెంట్లు జలమయం కావడంతో కనీసం 600 మంది నిరాశ్రయులయ్యారు.
దేశ రాజధానిలో కొత్తగా కొవిడ్ కేసులు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.